మణిపూర్‌పై మౌనవ్రతమా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు చర్చలో భాగంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
- మణిపూర్ ముఖ్యమంత్రిని ఎందుకు తొలగించరు?
- కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టిన ప్రతిపక్షాలు
- అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
- నేడు కూడా చర్చ కొనసాగింపు.. రేపు ఓటింగ్
- మోదీ నోరు తెరిపించేందుకే అవిశ్వాస తీర్మానం రాష్ట్రం అట్టుడుకుతుంటే ప్రధాని నోరు మెదపరా?
న్యూఢిల్లీ, ఆగస్టు 8: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు చర్చలో భాగంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వ తీరును ప్రతిపక్ష ఎంపీలు ఎండగట్టారు. మణిపూర్‌పై ప్రధాని మోదీ మౌనవ్రతం పాటిస్తున్నారని, మూడు నెలలుగా రాష్ట్రం హింసాత్మక ఘటనలతో అట్టుడుకిపోతుంటే, ఆయన నోరు ఎందుకు పెగలడం లేదని దుయ్యబట్టారు. మణిపూర్ అల్లర్లపై మోదీ నోరు తెరిపించడంతో పాటు రాష్ర్టానికి న్యాయం కోసం అవిశ్వాసం పెట్టినట్టు పేర్కొన్నాయి. కాగా, అవిశ్వాస తీర్మానంపై చర్చ బుధవారం కూడా కొనసాగనున్నది. గురువారం ప్రధాని మోదీ సమాధానంతో పాటు ఓటింగ్ నిర్వహించనున్నారు.
విభజించు-పాలించు కుట్రలు
అవిశ్వాస తీర్మానంపై చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మణిపూర్ అల్లర్లపై కేంద్రానికి వరుస ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ ఎందుకు పర్యటించలేదని, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసాకాండపై నోరు విప్పేందుకు ఆయన 80 రోజుల సమయం ఎందుకు తీసుకొన్నారని, మణిపూర్ సీఎంగా బీరేన్‌సింగ్ ఎందుకు తొలగించలేదని సూటిగా ప్రశ్నించారు. ‘వన్ ఇండియా’ అంటూ మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం.. మణిపూర్‌ను రెండుగా(లోయ, కొండ ప్రాంతాల్లో నివసించే మైతీలు, కుకీలు) విభజించిందని దుయ్యబట్టారు.
బీరేన్ రాజీనామా చేయాలి
మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా చేయాలని చర్చలో భాగంగా విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశ సమాఖ్య వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దారుణాలు సిగ్గుచేటు అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇలాంటి అమానుష ఘటనలను మీరు అనుమతిస్తారా? దేశ మహిళలను అవమానిస్తారా? ఈ ప్రభుత్వానికి మీరు ఎలా మద్దతు పలుకుతున్నారో మీ మనసాక్షిని అడగండి’ అని ఎన్డీయే కూటమి ఎంపీలకు హితవు పలికారు.
ప్రపంచ నేతపై అవిశ్వాసమా?
కాగా, ప్రభుత్వంపై విపక్షాలు అవిశ్వాసం పెట్టడాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. తప్పుడు సమయంలో, తప్పుడు పద్ధతిలో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రపంచ నేతగా ఎదుగుతున్న సమయంలో ఇటువంటి తీర్మానం తీసుకురావడం సరికాదని చెప్పుకొచ్చారు. అవిశ్వాసం ద్వారా ప్రతిపక్షాలు ‘పేదల బిడ్డ’ను లక్ష్యంగా చేసుకొన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యానించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

