కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్సభలో చర్చ ప్రారంభమైంది. మొదటి రోజు చర్చలో భాగంగా అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.
బీజేపీ సీఎం హిమంత బిస్వా శర్మ తెలివి తక్కువ చర్యల వల్ల అస్సాంలో అమాయక బాలికలు చనిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ విమర్శించారు. ఒక గర్భిణీ బాలిక మరణంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.