Air Pollution | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో వాయు కాలుష్యం (Air Pollution) క్షీణించింది. దీపావళి పండుగకు ముందే గాలి నాణ్యత పడిపోయింది. వరుసగా రెండో రోజు అంటే గురువారం కూడా రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక (AQI) 300 దాటింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏక్యూఐ 300 మార్క్‌ని దాటింది. ఘజియాబాద్‌లోని లోని ప్రాంతంలో అత్యధికంగా ఏక్యూఐ 339గా నమోదైంది. వసుంధర, ఇందిరాపురం వంటి ప్రాంతాల్లో 287గా, సంజయ్ నగర్లో 260గా ఉంది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలో ఏక్యూఐ లెవెల్స్ 335, వజీర్‌పూర్‌లో 337, బవానాలో 281, ముండ్కాలో 297గా ఏక్యూఐ నమోదైంది. ఇక నోయిడాలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సెక్టార్ 125లో ఏక్యూఐ లెవెల్స్ 358గా, సెక్టార్ 116లో 334, సెక్టార్ 1లో 257, సెక్టార్ 62లో 207గా ఏక్యూఐ నమోదైంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
Also Read..
IMD | నైరుతి నిష్క్రమణ.. ఈశాన్య రుతుపవనాలు ఆగమనం : ఐఎండీ
JDU | బీహార్ ఎన్నికలు.. 44 మంది అభ్యర్థులతో జేడీయూ తుది జాబితా రిలీజ్
Rahul Gandhi | ట్రంప్‌కు మోదీ భయపడ్డారు : రాహుల్ గాంధీ