Rahul Gandhi | ట్రంప్‌కు మోదీ భయపడ్డారు : రాహుల్ గాంధీ
Rahul Gandhi | ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.
Rahul Gandhi | రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై (Russian Oil) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇకపై రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయదని.. ఈ మేరకు ప్రధాని మోదీ (PM Modi) తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా స్పందించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పలు ప్రశ్నలు సంధిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ భయపడుతున్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ ప్రకటన చేసేందుకు ప్రధాని అనుమతించారు. అమెరికా పదేపదే తిడుతున్నా కూడా అవేవీ పట్టించుకోకుండా వారిని అభినందిస్తూ శుభాకాంక్షల మెసేజీలు పంపుతూనే ఉన్నారు. ఆర్థికమంత్రి అమెరికా పర్యటనను రద్దు చేశారు. ఈజిప్టులోని షర్మ్-ఎల్ షేక్‌లో సోమవారం జరిగిన గాజా శాంతి ఒప్పందం (Gaza peace summit) కార్యక్రమానికి ప్రధాని వెళ్లలేదు. ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ ప్రకటనలను ఖండించట్లేదు’ అని రాహుల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
PM Modi is frightened of Trump.
1. Allows Trump to decide and announce that India will not buy Russian oil.
2. Keeps sending congratulatory messages despite repeated snubs.
3. Canceled the Finance Minister’s visit to America.
4. Skipped Sharm el-Sheikh.
5. Doesn’t contradict him…— Rahul Gandhi (@RahulGandhi) October 16, 2025
Also Read..
Russian Oil | రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ వ్యాఖ్యలు.. స్పందించిన భారత్.. ఇంతకీ ఏమన్నదంటే..?
Donald Trump | మోదీ మాటిచ్చారు.. ఇకపై రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదు: డొనాల్డ్ ట్రంప్
India Passport | పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా.. దిగజారిన భారత్ స్థానం.. ఎంతంటే..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

