Rajnath Singh | రూ.45 వేల కోట్లతో ఆయుధ సంపత్తి కొనుగోళ్లు… డీఏసీ నిర్ణయం..!
Rajnath Singh | త్రివిధ దళాలను మరింత బలోపేతం చేయడానికి రూ.45 వేల కోట్లతో అత్యాధునిక ఆయుధ సంపత్తిని కొనుగోలు చేయాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశం నిర్ణయించింది.
Rajnath Singh | త్రివిధ బలగాలను మరింత పటిష్ట పరిచేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రూ.45 వేల కోట్ల వ్యయంతో అత్యాధునిక ఆయుధ సంపత్తి సమకూర్చాలని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డీఏసీ) నిర్ణయించింది. సైనిక బలగాలకు 12 సుఖోయ్ విమానాలు, ధృవాస్త్ర క్షిపణులతోపాటు ఆయుధ వ్యవస్థను సమకూర్చడానికి డీఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
`ఆత్మ నిర్భర్ భారత్` విధానంలో భాగంగా దేశీయ సంస్థల నుంచే వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖ ఉత్పత్తుల్లో దేశీయ సామాగ్రి వాడకం 50 నుంచి 60-65 శాతానికి పెంచాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఉత్పత్తుల వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని త్రివిధ దళాధిపతులను కోరారు.
ఆర్మీ అవసరాలకు లైట్ ఆర్మ్డ్ మల్టీ పర్పస్ వెహికల్స్, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్, హై మొబిలిటీ వెహికల్, గన్ టోయింగ్ వాహనాలు.. నావికా దళం కోసం అత్యాధునిక సర్వే నౌకలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను డీఏసీ ఆమోదించింది. ఇక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లను మరింత మెరుగు పర్చాలన్న వాయుసేన ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

