న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: బిలాస్పూర్ రోడ్-రుద్రాపూర్ సిటీ మధ్య ప్రయాణిస్తున్న గుజరాత్ మెయిల్‌కు తాజాగా పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలపై అడ్డంగా ఉన్న 6 మీటర్ల ఇనుప స్తంభాన్ని లోకో పైలట్ గుర్తించి రుద్రాపూర్ సిటీ స్టేషన్ మాస్టర్‌కు తెలియజేశాడు. ఇనుప స్తంభానికి తగలకుండా రైలును ఆపగలిగారు.
ఆ తర్వాత స్తంభాన్ని పట్టాలపై నుంచి తొలగించి రైలును యథావిధిగా నడిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. పట్టాలపై సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు ఉంచిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.