SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో మరోసారి సాంకేతికలోపం.. 24 రోజుల్లో తొమ్మిదోసారి!!
భారతీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సాంకేతిక లోపంతో సతమతమవుతోంది. తాజాగా, మంగళూరు నుంచి దుబాయ్‌కి బయలుదేరిన స్పైస్‌జెట్ బోయింగ్ 737 విమానం ముందు చక్రంలో సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిలిపివేశారు. దాన్ని పరిశీలించిన తర్వాత విమానం నడిపేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారి అనుమతించారు. అలాగే, స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ దుబాయ్‌కి ప్రత్యామ్నాయ విమానాన్ని కూడా పంపింది.

ల్యాండింగ్ సమయంలో ఇంజినీర్లు ముందటి చక్రం స్ట్రట్ సాధారణం కంటే ఎక్కువగా కుదించుకుపోయినట్లు గమనించారు. ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని నిలిపివేశారు. ల్యాండింగ్ గేర్ స్ట్రట్ను తనిఖీ చేసిన తర్వాత అధికారులు విమానం నడిపేందుకు అనుమతించారు. ఓలియో స్ట్రట్లో ఉపయోగించిన నైట్రోజన్ తగ్గిపోవడం లేదా అంతర్గత సీల్ దెబ్బతినడం వల్ల సమస్య ఏర్పడి ఉండవచ్చని డీజీసీఏ అధికారి పేర్కొన్నారు. ఈ ఘటనతో స్పైస్‌జెట్‌కు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు గత 24 రోజుల్లోనే తొమ్మిదిసార్లు సాంకేతిక లోపంతో నిలిపివేసినట్లైంది. తరుచూ విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తుతుండడంతో స్పైస్‌జెట్ సంస్థకు డీజీసీఏ ఇటీవల షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?