హెలికాప్టర్ ప్రమాదంలో మరో ఆరుగురి మృతదేహాలు గుర్తింపు
Helicopter crash | హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయితేజతోపాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినవారిలో మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన సాయితేజతోపాటు వివేక్ కుమార్, మరో నలుగురు వాయుసేన సిబ్బంది మృతదేహాలను గుర్తించారు. వారి పార్థివదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మృతదేహాలను విమానాల్లో స్వస్థలాలకు తరలించనున్నామని, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు.
గత బుధవారం తమిళనాడులోని ఊటీ కొండల్లో వాయుసేన విమానం కుప్పకూలింది. దీంతో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే మృతదేహాలు పూర్తి కాలిపోవడంతో గుర్తింపు ప్రక్రియ ఆలస్యమయింది. సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతోపాటు బ్రిగేడియర్ లిద్దరు మృతదేహాలను మాత్రమే గుర్తించగలిగారు. మరో 10 మందిని గుర్తించడం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి, వారిని గుర్తిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

