Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో (National Park area) మావోయిస్టులు (Naxalites), భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలి నుంచి ఏకే-47, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది.
బీజాపూర్ జిల్లాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత లక్ష్మీనర్సింహాచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ బండి ప్రకాశ్ మరణించిన విషయం తెలిసిందే. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ), స్పెషల్ టాస్క్ఫోర్స్(ఎస్టీఎఫ్) భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
Also Read..
మావోయిస్టు అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో ఘటన
Bangalore Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రటరీపై వేటు