అమెరికాలో ఏపీ విద్యార్థి హత్య
తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వదిలేశారు.
- కారులో మృతదేహం గుర్తింపు
న్యూఢిల్లీ, మార్చి 17: తెలుగు విద్యార్థి ఒకరు అమెరికాలో దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన 20 ఏండ్ల పరుచూరి అభిజిత్‌ను దుండగులు దారుణంగా హత్య చేసి అతని మృతదేహాన్ని కారులో ఉంచి అడవి సమీపంలో వదిలేశారు. గత ఏడాదే బోస్టన్ యూనివర్సిటీలో చేరిన అభిజిత్ తన క్లాస్మేట్లతో కలిసి ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.
యథాప్రకారం వారితో యూనివర్సిటీకి వెళ్లిన అభిజిత్ తిరిగి రాకపోడంతో అతని రూమ్మేట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఒక అడవి సమీపంలో వదిలేసిన కారులో అతని మృతదేహాన్ని కనుగొన్నారు. హత్యకు గల కారణం వెల్లడి కాలేదు. అభిజిత్ దగ్గర ఉన్న డబ్బు, ల్యాప్‌టాప్ కోసం దుండగులు హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అతని మరణం గురించి తెలిసి బంధువులు తీవ్రంగా రోదిస్తున్నారు. అతని మృతదేహాన్ని భారత్‌కు పంపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

