శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 13:34:55

ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు

ఏపీలో 12కు చేరిన కరోనా కేసులు

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖకు చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి బంధువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  తాజాగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య 12కు చేరింది. బర్మింగ్‌హమ్‌ నుంచి వచ్చిన వ్యక్తితో లోకల్‌ కాంటాక్ట్‌ అయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఈనెల 17న ఆ వ్యక్తి విశాఖపట్నం వచ్చారని 21న ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం చేరారని వెల్లడించింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 317 మందికి నెగిటివ్‌ రాగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


logo