అమరావతి: చత్తీస్‌ఘడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది జవాన్లు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ జవాన్లు ఉన్నారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన ఆ ఇద్దరు జవాన్ల కుటుంబాలకు 30 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై ఏపీ సీఎం జగన్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇద్దరు జవాన్ల మృతి పట్ల ఆయన సంతాపం తెలిపారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీకి చెందిన రౌతు జగదీశ్, శాఖమూరి మురళీ కృష్ణలు.. మావోల బుల్లెట్లకు నేలకూలారు. ఈ ఇద్దరూ విజయనగరం, గుంటూరు జిల్లాలకు చెందినవారు. విజయనగరం జిల్లా ఎస్పీ బీ రాజకుమారి .. ఇవాళ అమర జవాను ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు.
ఛత్తీస్‌గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని సీఎం పేర్కొన్నారు. మృతుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. ఇరు కుటుంబాలకు రూ.30లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 5, 2021