న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల తనయుడు అనంత్ అంబానీ కోసం ప్రముఖ అమెరికన్ బ్రాండ్ సరికొత్త చేతి గడియారాన్ని తయారు చేసింది. అనంత్ గుజరాత్లో నిర్వహిస్తున్న వంతార అభయారణ్యం స్ఫూర్తితో ఈ వాచీని రూపొందించింది. దీని విలువను ఆ కంపెనీ అధికారికంగా ప్రకటించ లేదు. దీని ఖరీదు సుమారు రూ.13.73 కోట్లు ఉండవచ్చు.
నటుడు సల్మాన్ ఖాన్ వంటి వీవీఐపీల కోసం ప్రత్యేకమైన గడియారాలను తయారు చేసే జాకోబ్ అండ్ కంపెనీ ఒపేరా వంతార గ్రీన్ కేమో అనే పేరుతో ఈ గడియారాన్ని తయారు చేసింది. అమెరికాలోని ఈ కంపెనీ ఈ వాచీలో అనంత్ అంబానీ చిత్రాన్ని హస్త కళా నైపుణ్యంతో చిత్రీకరించింది. దీనిలో మొత్తం 397 జెమ్స్టోన్స్ ఉన్నాయి.