ముంబై: రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. భానుడి భగభగలకు ఉపశమనంగా చిరు జల్లులు పలకరిస్తుండటంతో జనం ఊరట చెందుతున్నారు. ఇక తొలకరి జల్లులో తడుస్తూ ఓ చిన్నారి కేరింతలు కొడుతున్న వీడియోను (viral video) పారిశ్రామిక దిగ్గజం, మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశారు.
That just about sums up how it feels to come home to Mumbai to see that the monsoon has finally arrived… (the inner child in every Indian will never tire of finding joy in the first showers…)
pic.twitter.com/0TaBHfAy3v— anand mahindra (@anandmahindra) June 27, 2023
రుతుపవనాలు ఎట్టకేలకు ముంబైకి చేరుకోగా ఇంటి నుంచి తొలకరి జల్లులను ఆస్వాదించడం ఎలా ఉంటుందనేది ఈ వీడియో వెల్లడిస్తోందని ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. ప్రతి భారతీయుడి లోపల ఉండే చిన్నారి తొలకరి జల్లులను ఎంజాయ్ చేయడంలో ఏమాత్రం అలిసిపోడని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ముంబైలో వానాకాలం అంటే కేవలం వర్షాలే కాదు..ఓ ఫన్, హంగామా, చిన్ననాటి జ్ఞాపకాల అనుభూతులు అని ఓ యూజర్ కామెంట్ చేయగా, వర్షాకాలంలో ముంబై ఓ ఆటస్ధలంలా మారుతుందని ఓ యూజర్ కామెంట్ చేశారు. చిన్నతనంలో వర్షపు నీటిలో కాగితపు పడవలు వేసి సందడి చేసే వారమని ఆ రోజులే అద్భుతమని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Indian Army: మణిపూర్ మహిళలకు విజ్ఞప్తి.. వీడియో రిలీజ్ చేసిన ఆర్మీ