Thief | న్యూఢిల్లీ: శనివారం రాత్రి ఢిల్లీలోని ఓ బోరు బావిలో పడిన గుర్తు తెలియని యువకుడు(30) మృతి చెందాడు. మృతుడు దొంగతనం చేసిన తర్వాత తప్పించుకొనే ప్రయత్నంలో బోరు బావిలో పడిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
అతడిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని.. ఢిల్లీ జల వనరుల శాఖ మంత్రి ఆతీశీ ఎక్స్‌లో వెల్లడించారు. బోరు బావి గదికి తాళం వేసి ఉన్నా.. విరిగిన గోడ ఎక్కి యువకుడు ఆ గదిలోకి ప్రవేశించి ఉంటాడని భావిస్తున్నారు.