CBI | భువనేశ్వర్: ఓ వ్యాపారి నుంచి రూ. 20 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడో ఈడీ అధికారి. ఒడిశాలోని డెంకనల్కు చెందిన స్టోన్ మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్‌పై ఈడీ కేసు నమోదైంది. ఈ కేసు నుంచి ఆయనను బయటపడేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న చింతన్ రఘువంశీ రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అతడి నుంచి మొదటి ఇన్స్టాల్మెంట్ కింద రూ.20 లక్షలు అందుకుంటుండగా ఈడీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈడీ తనపై కేసు నమోదు చేసి ప్రశ్నించేందుకు పిలవడంతో రౌత్ వెళ్లగా కేసు నుంచి ఉపశమనం పొందాలంటే భగతి అనే వ్యక్తిని కలవాలని సూచించారు. ఈ కేసులో అరెస్ట్ కాకుండా ఉండాలంటే రఘువంశీకి రూ. 5 కోట్లు చెల్లించాలని భగతి డిమాండ్ చేశాడు. ఆ తర్వాత రఘువంశీతో మాట్లాడి రూ. 2 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడత ఇన్స్టాల్మెంట్గా రూ. 20 లక్షలు పుచ్చుకుంటుండగారెడ్ హ్యాండెడ్‌గా రఘువంశీని పట్టుకున్నారు.