Earthquake | మహారాష్ట్ర (Maharashtra)లో భూకంపం (Earthquake) సంభవించింది. హింగోలి (Hingoli)లో బుధవారం ఉదయం 7:14 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
‘మహారాష్ట్రలోని హింగోలిలో ఈరోజు భూకంపం సంభవించింది. ఉదయం 07:14 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది’ అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు తెలిపారు.
Also Read..
Bypolls | 7 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఉప ఎన్నికల పోలింగ్
Kedarnath MLA | కేదార్నాథ్ బీజేపీ ఎమ్మెల్యే శైలా రాణి మృతి
Suicide attempt | ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం.. కారుతో సహా చెరువులోకి..!