Suicide attempt : ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా చెరువులోకి పోనిచ్చాడు. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోగల ఇనాంగూడ చెరువు దగ్గర బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బీఎన్‌రెడ్డి నగర్ వాసి అయిన అశోక్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున మార్నింగ్ వాక్కు అని చెప్పి పిల్లలు ముగ్గురిని కారులో ఎక్కించుకున్న ఆయన ఇనాంగూడ చెరువువైపు తీసుకెళ్లాడు. చెరువు పక్కన మార్గంలో వెళ్తూనే ఒక్కసారిగా కారును చెరువులోకి మళ్లించాడు. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించారు.
తాళ్లు, టైర్లతో వెంటనే చెరువులోకి దూకి తండ్రి నలుగురిని కాపాడారు. అశోక్ ముగ్గురు పిల్లల్లో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అయితే కాంట్రాక్టర్ అశోక్ పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేయడానికిగల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు ఎంక్వయిరీ చేస్తున్నారు.
తన పిల్లలను చంపి తాను కూడా చనిపోడానికి చెరువులోకి కారు తీసుకెళ్లిన తండ్రి
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్‌లోని ఓ తండ్రి తన ముగురు పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకోడానికి ఇనాంగూడ చెరువులోకి తన కారును వేగంగా డ్రైవ్ చేశాడు.
ఆది చూసిన స్థానికులు ప్రమాదవశాత్తు దూసుకు… pic.twitter.com/MaOxF2hRIy
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024