Kedarnath MLA | ఉత్తరాఖండ్ జిల్లాలో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించారు (BJP MLA Dies). ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఎమ్మెల్యే (Kedarnath MLA) శైలా రాణి రావత్ (Shaila Rani Rawat) డెహ్రాడూన్ (Dehradun)లోని మ్యాక్స్ ఆసుపత్రిలో (Max Hospital) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆమె వయసు 68 ఏళ్లు. వెన్నెముక గాయం కారణంగా ఇటీవలే ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం రాత్రి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శైలారాణి రావత్.. 2012లో కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారిగా కేదార్నాథ్ స్థానం నుంచి ఉత్తరాఖండ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, 2016లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్‌పై 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. వారిలో ఆమె కూడా ఉన్నారు. ఆ తర్వాత 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2022లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Also Read..
Bypolls | 7 రాష్ట్రాల్లో ప్రారంభమైన ఉప ఎన్నికల పోలింగ్
Suicide attempt | ముగ్గురు పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్యాయత్నం.. కారుతో సహా చెరువులోకి..!
Puri temple | నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్న జగన్నాథుడి రత్న భాండాగారం..!