Puri temple | నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్న జగన్నాథుడి రత్న భాండాగారం..!
Puri temple | ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ.. ఆ మేరకు ఒడిశా సర్కారుకు సిఫారసు చేసింది. దాంతో జూలై 14న జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Puri temple : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత తెరుచుకోబోతున్నది. ఈ నెల 14న రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ.. ఆ మేరకు ఒడిశా సర్కారుకు సిఫారసు చేసింది. దాంతో జూలై 14న జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి వెలకట్టలేని ఆభరణాలను ఐదు చెక్క పెట్టెల్లో ఉంచి, రహస్య గదిలో భద్రపరిచారు. అయితే గతంలో అప్పుడప్పుడు ఆ గదిని తెరిచి సంపద లెక్కించేవారు. కానీ 1978 నుంచి దాన్ని తెరవడం ఆపేశారు. దాంతో ఆ భాండాగారం విషయంలో వివాదాలెన్నో తెరపైకి వచ్చాయి.
ఆ భాండాగారానికి సంబంధించిన తాళం ఏమైందనే అంశం మొన్నటి ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. బీజేడీ పాలన ముగిసి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీ సర్కారు జగన్నాథుడి రత్న భాండాగారాన్ని తెరవాలని నిర్ణయించింది. దాంతో సుమారు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రత్న భాండాగారం తెరుచుకోబోతోంది.
రత్న భాండాగారంలో ఆభరణాల లెక్కింపుతోపాటు అవసరమైన వాటికి మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇదే విషయమై ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ.. 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. భాండాగారం తెరవడంతోపాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి నివేదించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

