ముంబై, జూన్ 25 (నమస్తే తెలంగాణ ) : మహారాష్ట్రలోని హింగోలీలో బుధవారం ఓ 18 ఏండ్ల నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బలవనర్మణానికి పాల్పడే ముందు రికార్డు చేసిన వీడియోలో అమ్మా..నన్ను క్షమిం చు అని అతడు చేతులు జోడించి తన తల్లిని వేడుకున్నాడు.
నీట్ రీటెస్టుకు సుశీల్ ధాగే హాజరయ్యాడు. కానీ పరీక్ష రద్దయినప్పటి నుంచే డిప్రెషన్లో ఉన్నట్టు ఫ్యామిలీ చెబుతోంది. అమ్మా, ఈ రోజు నేను నా ప్రాణం తీసుకుంటున్నాను. దయచేసి బాధపడకు. వచ్చే జన్మలో మళ్లీ నీ కడుపులోనే పుట్టి నీకు ఎలాంటి బాధను కలిగించను అని తన మొబైల్ ఫోన్లో రికార్డు చేసిన వీడియోలో ధాగే చెప్పాడు.