ఢిల్లీ: యువ షట్లర్ తన్వి శర్మ జోరు కొనసాగుతున్నది. కొరియా మాస్టర్స్‌లో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తన్వి.. 21-16, 17-21, 21-13తో హైదరాబాద్ అమ్మాయిశ్రీయాన్షిని ఓడించి క్వార్టర్స్ చేరుకుంది. క్వార్టర్స్‌లో ఆమె మరో భారత షట్లర్ రక్షిత రామ్‌రాజ్‌తో తలపడనుంది.
మరో మ్యాచ్‌లో రక్షిత.. 22-20, 21-10తో మనమి సుయిజు (జపాన్)పై గెలిచింది. అష్మిత చాలిహా.. 21-17, 21-6తో కిమ్ మిన్ జి (దక్షిణ కొరియా)ని ఓడించి ముందంజ వేసింది. మెన్స్ డబుల్స్‌లో హైదరాబాదీ గరగ కృష్ణ ప్రసాద్-పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ జోడీ.. 21-18, 21-19తో కిమ్-షిన్ (సౌత్ కొరియా)ను చిత్తుచేసి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.