Amul Milk | దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ (Amul Milk) కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పాల ధరలను తగ్గించింది. ఈ విషయాన్ని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ జయేన్ మెహతా (Jayen Mehta) శుక్రవారం ప్రకటించారు. అమూల్ గోల్డ్, అమూల్ తాజా, అమూల్ టీ స్పెషల్ పాలపై రూ.1 చెప్పున తగ్గించినట్లు వెల్లడించారు. ఈ తగ్గింపు లీటర్ ప్యాక్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు.
తాజా నిర్ణయంతో లీటర్ అమూల్ గోల్డ్ పాల ధర రూ.66 నుంచి రూ.65కి తగ్గింది. అమూల్ టీ స్పెషల్ మిల్క్ లీటర్ ప్యాకెట్ ధర రూ.62 నుంచి రూ.61కి, అమూల్ తాజా పాల ధర లీటరుకు రూ.54 నుంచి రూ.53కి తగ్గింది. ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని సంస్థ ప్రకటించింది. కాగా, అమూల్ చివరిసారిగా గతేడాది జూన్‌లో పాల ధరలను లీటరుకు రూ.2 పెంచిన విషయం తెలిసిందే.
Amul has reduced the price of milk by Re 1 in Amul Gold, Amul Taza and Amul Tea Special 1 kg pack: Gujarat Co-operative Milk Marketing Federation’s Managing Director Jayen Mehta
(File photo) pic.twitter.com/MoxCCB4ljS
— ANI (@ANI) January 24, 2025
Also Read..
Sanjay Raut | త్వరలోనే మహారాష్ట్రకు మూడో డిప్యూటీ సీఎం : సంజయ్ రౌత్
Bomb Threat | మూడు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. భయాందోళనలో విద్యార్థులు
Manish Sisodia | జైల్లో ఉన్నప్పుడు నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు.. బీజేపీపై సిసోడియా సంచలన ఆరోపణలు