Firecracker factory | ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమ్రోహా (Amroha)లోని బాణసంచా ఫ్యాక్టరీ (Firecracker factory)లో పేలుడు (Blast) సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చిక్కుకుని పలువురు గాయపడ్డారు.
సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. అది అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీగా తెలిసింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. 12 మంది గాయపడ్డారు. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో శిథిలాలు 300 మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి. పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
PM Modi | ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పురస్కారంతో సత్కరించిన సైప్రస్
Sonia Gandhi | నిలకడగానే సోనియా గాంధీ ఆరోగ్యం
Heavy traffic | అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు.. Video