Sonia Gandhi | కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఉదర సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారం దవాఖానలో చేరారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే (health remains stable) ఉన్నట్లు ఆసుపత్రి చైర్మన్ అజయ్ స్వరూప్ తెలిపారు. గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు సోనియాని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఉదర సంబంధిత సమస్యలతో సోనియా గాంధీ ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఆసుపత్రిలో చేరారు. ఈ నెల 9వ తేదీన ఇదే ఆస్పత్రిలో సోనియా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.
Also Read..
Heavy traffic | అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలు.. Video
Census | జనగణనకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం
Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్ష ద్వారా 87 మృతదేహాలు గుర్తింపు