న్యూఢిల్లీ : పొరుగు దేశాల్లో తలెత్తుతున్న ఆందోళనలు, నిరసనలు మన దేశంలోని పాలకులను ఆలోచనలో పడేస్తున్నాయి. మనదేశంలో.. ము ఖ్యంగా 1974 తర్వాత తలెత్తిన నిరసనలన్నింటిపైనా అధ్యయనం చేయాలని కేంద్ర హోంశాఖ అధికారులను అమిత్ షా ఆదేశించారట.
నిరసనల వెనుకున్న కారణాల్ని విశ్లేషించాలని, ముఖ్యంగా ఆర్థిక కోణాలు, తెరవెనుక వ్యక్తులు, తుది ఫలితాలు.. మొదలైనవి తెలుపుతూ ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రిసెర్చ్, డెవలప్మెంట్’ అధికారుల నుంచి అమిత్ షా నివేదిక కోరారు. దేశవ్యాప్తంగా సామూహిక ప్రజా ఆం దోళనలు, నిరసనలు తలెత్తితే.. వాటి ని ఎలా ఎదుర్కోవాలి? అన్నదానిపై కసరత్తు చేయాలని వారికి తెలిపారట.