న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీలో శక్తివంతమైన బాంబు పేలుడులో 12 మంది మృతి చెందడానికి కేంద్రం బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషాద ఘటనకు ప్రత్యక్ష బాధ్యత వహిస్తూ హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ డిమాండ్ చేశారు. ‘ఈ స్వతంత్ర భారత దేశంలో ఏకైక అసమర్థ హోం మంత్రి అమిత్ షాయే’ అని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. ఈ దేశానికి సమర్థుడైన హోం మంత్రి కావాలే తప్ప విద్వేషాన్ని ప్రచారం చేసేవారు కాదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహు వా మొయిత్రా విమర్శించారు.