Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోవధను అడ్డుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్లోని మధుబనిలో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
ఈ ప్రాంతంలో గోవధ కేసులు పెద్దసంఖ్యలో వెలుగుచూస్తున్నాయని తాము తిరిగి అధికారంలోకి రాగానే వాటిని అరికడతామని హామీ ఇచ్చారు. సీతమ్మ తల్లి జన్మస్ధలమైన ఈ ప్రాంతంలో గోవధ ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇక్కడ గోవధ, గోవుల అక్రమ రవాణాను అనుమతించమని, ఇది మోదీ గ్యారంటీ అని అమిత్ షా భరోసా ఇచ్చారు.
Read More :
Shyam Rangeela | వారణాసిలో మోదీపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు ఝలక్ ఇచ్చిన అధికారులు