Loksabha Elections 2024 : ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము కశ్మీర్లో పరిస్ధితిని బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోనియా-మన్మోహన్ ప్రభుత్వ హయాంలో ఎన్నో బాంబు పేలుళ్లు జరిగాయని అమిత్ షా గుర్తుచేశారు.
ఉగ్రదాడులు జరిగినా అప్పటి యూపీఏ ప్రభుత్వం దీటుగా బదులివ్వలేదని, తమ ఓటు బ్యాంక్ కోల్పోతామనే భయంతో మౌనంగా ఉందని ఆరోపించారు. తాము ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరితో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. బిహార్లో ఎన్డీయే కూటమి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని, గతంలో వచ్చిన ఫలితాలు పునరావృతమవుతాయని అన్నారు.
శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ పోటీకి దూరంగా ఉండటంపై ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో బీజేపీ బలంగా లేదని ఓ వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ బలోపేతమైన అనంతరం ఎన్నికల బరిలో నిలుస్తామని, ఆపై విజయం సాధిస్తామనే విశ్వాసం తనకు సంపూర్ణంగా ఉందని చెప్పారు.
Read More :
పాక్ దగ్గర అణు బాంబులుంటే మన అణుబాంబులు ఫ్రిజ్లో దాచేందుకు ఉన్నాయా..? : యోగి ఆదిత్యానాథ్