న్యూఢిల్లీ : వలస పాలన నాటిక్రిమినల్ చట్టాల స్ధానంలో తీసుకువచ్చిన మూడు బిల్లులు మానవ కోణంలో నేర న్యాయ వ్యవస్ధలో సమగ్ర మార్పులు తీసుకువస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. పెనాల్టీల విధింపుతో సరిపెట్టకుండా నూతన బిల్లులతో న్యాయం జరుగుతుందని చెప్పారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చకు హోంమంత్రి బదులిస్తూ ఈ మూడు ప్రతిపాదిత చట్టాలు ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనాన్ని కలిగి ఉన్నాయని, దేశద్రోహాన్ని నేరంగా పరిగణిస్తూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు పేరుతో కొత్త సెక్షన్‌ను ప్రవేశపెడుతున్నాయని షా చెప్పారు. ఈ మూడు బిల్లుల ముసాయిదాపై సమగ్రంగా చర్చించన అనంతరమే సభ అనుమతి కోసం ప్రవేశపెట్టామని అమిత్ షా పేర్కొన్నారు.
ప్రస్తుత నేర చట్టాలు ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) న్యాయం అందించేందుకు బదులు శిక్షించే ఉద్దేశంతో వలసవాద ధోరణికి అద్దం పడతాయని, ఈ మూడు ప్రతిపాదిత బిల్లులతో భారత ఆలోచనధోరణికి అద్దం పట్టేలా న్యాయ వ్యవస్ధను నెలకొల్పేలా రూపొందాయని చెప్పారు. ఈ మూడు ప్రతిపాదిత నేర చట్టాలు ప్రజలను వలసవాద ఆలోచన, దాని సంకేతాల నుంచి బయటపడేస్తాయని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
Read More :
Coronavirus | కొవిడ్ కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన