Amit shah : హరియాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ముమ్మరం చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఫరీదాబాద్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అవాస్తవాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ నేతలు ఆరితేరారని ఆయన ఆరోపించారు. అగ్నివీర్ జవాన్లకు పనిలేదని, వారికి పెన్షన్ కూడా లేదని కాంగ్రెస్ నేతలు అసత్యాలు వల్లెవేస్తున్నారని అన్నారు.
అగ్నివీర్ స్కీమ్‌లో జవాన్లకు పోలీస్ సర్వీసుల్లో 20 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని వారికి గుర్తుచేస్తున్నానని అన్నారు. హరియాణలోనూ బుజ్జగింపు రాజకీయాలు చేయాలని కాంగ్రెస్ కోరుకుంటున్నదని దుయ్యబట్టారు. ఇక అంతకుముందు అమిత్ షా లోహరులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ సేవలో హరియాణ ప్రజల వాటా ప్రశంసనీయమని అన్నారు. స్వాతంత్య్రానంతరం హరియాణ నుంచే త్రివిధ దళాల్లోకి అత్యధిక సంఖ్యలో సైనికులు వచ్చారని అన్నారు.
మనం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్ధితుల్లో ఉండగా హరియాణ రైతులు దేశాన్ని ఆదుకున్నారని తెలిపారు. హరియాణ రైతులు చెమటోడ్చి మనకు మిగులు ఆహార ధాన్యాలను అందించారని అన్నారు. ఇక ఒలింపిక్స్, పారాఒలింపిక్స్‌లో అత్యధిక మెడల్స్‌ను దేశానికి హరియాణ అథ్లెట్లు అందించారని వివరించారు. ఇక హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదని అమిత్ షా స్పష్టం చేశారు.
Read More :
Swaminarayan temple: న్యూయార్క్‌లో స్వామినారాయణ్ ఆలయంపై దాడి