Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి పాలనా పగ్గాలు చేపడితే రిజర్వేషన్లను తొలగిస్తారని కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హరియాణలోని ఝజర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో బీజేపీ ఉన్నంతవరకూ రిజర్వేషన్లను ఏ ఒక్కరూ కదిలించలేరని అన్నారు.
ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఎన్నికల అనంతరం బైనాక్యులర్స్‌తో వెతికినా కాంగ్రెస్ పార్టీ కనిపించదని అమిత్ షా ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం సాగిస్తోందని దుయ్యబట్టారు.
Read More :
School Fees | ఇక సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు..!