న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాం ఉగ్రదాడితో పాకిస్థాన్, భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో గురువారం సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన పలు అంశాలను వారు ఆమెకు వివరించినట్టు సమాచారం.
ఈ భేటీకి సంబంధించిన ఫొటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అలాగే పహల్గాం దాడి నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ చైనా, కెనడా సహా జీ20 దేశాల ఎంపిక చేసిన రాయబారులతో సమావేశం జరిపింది.