న్యూఢిల్లీ, జనవరి 7: దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన భారత్‌పోల్ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం భారత్ మండపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) రూపొందించిన ఈ పోర్టల్‌లో రియల్‌టైమ్ ఇంటర్ఫేస్ ముఖ్యమైన అంశమని చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సులభంగా ఇంటర్‌పోల్‌కు అనుసంధానమై తమ దర్యాప్తులను వేగవంతం చేయవచ్చని తెలిపారు. నేరాలకు పాల్పడి భారత్ నుంచి పారిపోయిన నేరస్థులను నిర్బంధించి, వారిని స్వదేశానికి రప్పించడం కోసం ఆధునిక టెక్నాలజీని, టెక్నిక్లను ఉపయోగించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు.