చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అన్ని పార్టీల అగ్ర నేతలు రంగంలోకి దిగి ప్రజలను ఓట్లడుగుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సినీ నటి, బీజేపీ అభ్యర్థి కుష్బూ సుందర్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కుష్బూ సుందర్ పోటీ చేస్తున్న థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమిత్ రోడ్ షో నిర్వహించారు.
కుష్బూతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి.. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే-కాంగ్రెస్ కూటమిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే అవినీతిమయ డీఎంకే-కాంగ్రెస్ కూటమిని మరోసారి ఓడించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులతో తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత కలలు నెరవేరుతాయన్నారు.
ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చాలా చక్కగా పనిచేస్తున్నారని అమిత్ షా కితాబిచ్చారు. అందుకే ప్రజలు మరోసారి రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవాలని.. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని షా పిలుపునిచ్చారు.
Union Home Minister and BJP leader Amit Shah holds a roadshow in Thousand Lights assembly constituency as he campaigns for the party's candidate Khushbu Sundar.#TamilNaduElections2021 pic.twitter.com/hohWCwoG8O
— ANI (@ANI) April 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఐసీయూ నుంచి స్పెషల్ రూమ్‌కు రాష్ట్రపతి
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు