ముంబై, జూన్ 20: మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక్కటే శివసేన మిగిలిందని.. అదే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొల్హాపూర్ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఏక్నాథ్ షిండే వర్గం విడిపోయినప్పటి నుంచి నాలుగేండ్లుగా ఏం సాధించిందో అంతా చూశారు.
అప్పట్లో షిండే శివసేన వర్గం అని పిలవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒక్కటే శివసేన ఉంది’ అని అమిత్ షా చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూటీబీ) నుంచి ఆరుగురు ఎంపీలు ప్రత్యేక వర్గంగా ఏర్పడ్డ నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు గమనార్హం. త్వరలోనే ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరి ఎన్డీయేకు మద్దతిస్తారని తెలుస్తున్నది. షిండే వర్గం ఆపరేషన్ టైగర్ పేరుతో ఉద్ధవ్ వర్గాన్ని తమ పార్టీలో చేర్చుకుంటున్నది.