ముంబై: శివసేన ఎమ్మెల్యే శరద్ సోనావనే బుధవారం శాసనసభకు చిరుత పులి మాదిరిగా వస్ర్తాలను ధరించి వచ్చారు. మహారాష్ట్రలో చిరుత పులుల దాడులు పెరుగుతున్నాయని, తాను ఓ దశాబ్దం నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ, పరిష్కారం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిరుత పులులను పట్టుకుని, పునరావాస కేంద్రాల్లో నిర్బంధించాలని కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జున్నార్ నియోజకవర్గంలో గడచిన మూడు నెలల్లో చిరుత పులుల దాడుల్లో 55 మంది మరణించారని చెప్పారు. ఇదిలావుండగా, బుధవారం ఉదయం నాగ్పూర్ నగరంలో ఓ నివాస ప్రాంతంలోకి చిరుతపులి వచ్చి, ఏడుగురిని గాయపరచింది.