న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas war) నేపథ్యంలో పాలస్తీనాలోని గాజాలో సుమారు 12,000 మంది మరణించారు. వేల సంఖ్యలో గాయపడగా, లక్షలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో గాజాలోని పాలస్తీనా ప్రజల కోసం రెండో విడత మానవతా సహాయాన్ని భారత్ ఆదివారం పంపింది. ప్రాణాలను రక్షించే అవసరమైన మందులు, సర్జికల్ వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్లు, శానిటరీ, ఇతర అవసరమైన వస్తువులతో పాటు నీటి శుద్ధి మాత్రలు ఇందులో ఉన్నట్లు తెలుస్తున్నది. సీ17 విమానం 32 టన్నుల సహాయ సామగ్రితో ఈజిప్ట్‌లోని ఎల్ అరిష్ విమానాశ్రయానికి బయలుదేరిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయాన్ని అందిస్తూనే ఉంటామని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కాగా, అక్టోబర్ 22న గాజాకు తొలి విడత మానవతా సహాయాన్ని భారత్ పంపింది. వైద్య, విపత్తు సామగ్రిని పాలస్తీనా ప్రజలకు అందజేసింది. గాజా స్ట్రిప్, ఈజిప్ట్ సరిహద్దు ప్రాంతమైన రాఫా క్రాసింగ్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఎల్-అరిష్ విమానాశ్రయం ఉంది. ఇక్కడకు చేరుతున్న మానవతా సహాయ సామగ్రి ప్రస్తుతం రాఫా క్రాసింగ్ ద్వారానే గాజాలోకి తరలుతున్నది.
We continue to deliver humanitarian assistance to the people of Palestine.
Second @IAF_MCC C17 aircraft carrying 32 tonnes of aid departs for the El-Arish Airport in Egypt. pic.twitter.com/bNJ2EOJPaW
— Dr. S. Jaishankar (@DrSJaishankar) November 19, 2023