Israel-Palestine Conflict | హమాస్ దాడి నేపథ్యంలో.. ఇజ్రాయిల్‌కు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా
Air India cancels flights | ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి (Israel-Palestine Conflict ) నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్‌కు విమాన సేవలు నిలిపివేశాయి.
న్యూఢిల్లీ: ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి (Israel-Palestine Conflict ) నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా (Air India) రద్దు చేసింది. ఏఐ 139 విమానం శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 7.05 గంటలకు టెల్ అవీవ్ చేరుకోవాల్సి ఉంది. తిరుగు ప్రయాణంలో ఏఐ140 విమానం టెల్ అవీవ్ నుంచి రాత్రి 10.10 గంటలకు బయలుదేరి ఆదివారం ఉదయం 7 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. అయితే శనివారం ఉదయం ఇజ్రాయిల్‌పై హమాస్ అనూహ్యంగా దాడి చేసింది. గాజా నుంచి సుమారు ఐదు వేల క్షిపణులను ప్రయోగించింది. ప్రతిగా ఇజ్రాయిల్ కూడా ఎదురు దాడులు ప్రారంభించింది. తాము యుద్ధంలో ఉన్నట్లు ఆ దేశం పక్రటించింది. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితి నెలకొన్నట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.
కాగా, ఈ పరిణామాల నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా శనివారం ఢిల్లీ నుంచి టెల్ అవీవ్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యే విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంబంధిత ప్రయాణికులకు అన్ని విధాలా సహకరిస్తామని పేర్కొంది.
మరోవైపు పలు అంతర్జాతీయ విమాన సంస్థలు కూడా ఇజ్రాయిల్‌కు విమాన సేవలను నిలిపివేశాయి. జర్మన్ విమానయాన సంస్థ లుఫ్తాన్సా, స్విస్ ఎయిర్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో సహా అనేక విమానయాన సంస్థలు ఇజ్రాయిల్‌కు విమానాలను రద్దు చేశాయి.
Hamas terrorists' attack on Israel | An Air India Flight from Delhi to Tel Aviv on 07 October 2023 and the return flight AI140 from Tel Aviv to Delhi has been cancelled in the interests and safety of our guests and crew. Passengers are being extended all support, as per their… pic.twitter.com/VdynXz0M6F
— ANI (@ANI) October 7, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

