న్యూఢిల్లీ: అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
ప్రమాదంలో కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను చిత్తూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన తిరుమూరు గోపి, శ్రీకాళహస్తికి చెందిన రజిని శివ, హరిగా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ హరి భర్త సాయి చెన్ను పరిస్థితి విషమంగా ఉంది.