కోల్కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఆమె బుధవారం కోల్కతాలో జైన మతస్థుల కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను మైనారిటీలను, వారి ఆస్తులను కాపాడతానని హామీ ఇచ్చారు.
విభజించు, పాలించు విధానాన్ని బెంగాల్లో అనుమతించబోమన్నారు. బంగ్లాదేశ్లో పరిస్థితిని చూడాలని, ఈ చట్టాన్ని ఇప్పుడు ఆమోదించి ఉండకూడదని చెప్పారు. మరోవైపు, వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.