న్యూఢిల్లీ: అమర్నాథ్ యాత్రను ఈ ఏడాది జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కేవలం 38 రోజులు మాత్రమే నిర్వహించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. పహాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో 26 మంది యాత్రికులు మృతిచెందగా, ప్రభుత్వం రక్షణ కారణాలు చూపుతూ ఈ నిర్ణయం తీసుకుంది.
అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో 50 వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్ము కశ్మీర్ పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. బలగాల వాహనాల రాకపోకల కోసం ఆయా మార్గాల్లో ప్రత్యేకంగా జామర్లను ఏర్పాటు చేశారు. యాత్రికులు ప్రయాణించే మార్గంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.