న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో రెండురోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. పహల్గాం, బల్తాల్ నుంచి యాత్రను గురువారం రద్దు చేసినట్టు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్‌కుమార్ ప్రకటించారు. బుధవారం ఆర్మీ అధికారులు క్యూలైన్లలో యాత్రికులను తీసుకెళ్తుండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. కొండచరియలు విరిగిపడి నలుగురు కొట్టుకుపోతున్న దృశ్యం ఆన్లైన్లో వైరల్ అయ్యింది. ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన నాటి నుంచి యాత్రను నిలిపివేయడం ఇదే మొదటిసారి. అలాగే ఈ ఏడాది మృతి చెందిన యాత్రికుల సంఖ్య 15కు చేరింది.