జమ్ము: హిమాలయాల్లో ఎత్తయిన గుహలో సహజసిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించేందుకు అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. శనివారం అమర్నాథ్ గుహలో ఉదయం ప్రథమ పూజను నిర్వహించారు. లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూజలో పాల్గొన్నారు.
ఈ నెల 29 నుంచి మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు అవకాశం ఉంది. ఈ యాత్ర ఆగస్టు 19 వరకు కొనసాగుతుంది. ఇటీవల జమ్ము-కశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రవాద ఘటనలను పురస్కరించుకుని పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.