Haryana Elections : హరియాణలో ఆప్‌తో పొత్తుకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపుతుంటే రాష్ట్ర నాయకత్వం, స్ధానిక పార్టీ శ్రేణులు పొత్తుకు ససేమిరా అంటున్నాయి. ఆప్‌తో పొత్తు ఉండబోదని కాంగ్రెస్ శ్రేణులు తెగేసిచెబుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ఆప్‌తో పొత్తుపై స్పష్టత ఇచ్చారు.
అమరీందర్ సింగ్ బుధవారం చండీఘడ్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో పొత్తు ఉండే అవకాశం లేదనే సంకేతాలు పంపారు. గతంలోనూ ఇండియా అలయన్స్‌తో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. కానీ ఆప్‌తో ఎన్నడూ తాము అవగాహనకు రాలేదని స్పష్టం చేశారు. పంజాబ్‌లో పాలక ఆప్ తమ నేతలను నిర్బంధించారని, వేధించారని చెప్పారు.
శాసనసభ లోపల, వెలుపల తాము ఆప్‌తో పోరాడామని గుర్తుచేశారు. తాము గతంలోనూ ఇదే విషయం స్పష్టం చేశామని తెలిపారు. కాంగ్రెస్ హైకమాండ్ దేశవ్యాప్తంగా పొత్తులపై ఎలాంటి వైఖరి తీసుకున్నా ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటారని తేల్చిచెప్పారు. ఆప్‌తో పొత్తుపై స్ధానిక నాయకత్వంతో చర్చించిన మీదటే పార్టీ హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
Read More :
Hydraa | హైడ్రా పేరుతో రూ.20 లక్షలు డిమాండ్.. డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు