బుధవారం 05 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 19:36:27

అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడు: ప‌్ర‌ధాని

అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడు: ప‌్ర‌ధాని

న్యూఢిల్లీ: సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు అమ‌ర్‌సింగ్ మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్పందించారు. అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడ‌ని ఆయ‌న కొనియాడారు. దేశ రాజ‌కీయాల్లో అమ‌ర్‌సింగ్ త‌న‌దైన శైలిలో చ‌క్రం తిప్పాడ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. అమ‌ర్‌సింగ్ అకాల మ‌ర‌ణ‌వార్త చాలా బాధ క‌లిగించింద‌న్నారు. అమ‌ర్‌సింగ్ మృతికి సంతాపం ప్ర‌క‌టించి ఆయ‌న కుటుంబ‌స‌భ్యులు, బంధుమిత్రుల‌కు ప్ర‌ధాని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.  ‌   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo