Omicron | ముంబైలో కొవిడ్‌పై సర్వే.. షాకింగ్ ఫలితాలు వెలుగులోకి..!
Omicron Variant Cases | కరోనా రోగులపై ముంబైలో నిర్వహించిన సర్వలో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ముంబైలో 89శాతం కరోనా సోకిన రోగుల్లో

ముంబై : కరోనా రోగులపై ముంబైలో నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతి కలిగించే ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రకారం.. ముంబైలో 89శాతం కరోనా సోకిన రోగుల్లో ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. 280 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 89శాతం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలిందని అధికారులు తెలిపారు. మరో వైపు డెల్టా డెరివేటివ్ ఎనిమిదిశాతం, డెల్టా వేరియంట్ కేసులు మూడుశాతం కనుగొన్నట్లు గుర్తించారు.
89% మందికి ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. మరోవైపు, డెల్టా డెరివేటివ్‌లు ఎనిమిది శాతం మరియు డెల్టా వేరియంట్లు మూడుశాతం కనుగొన్నారు. సర్వేలో 373 నమూనాలను పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 280 నమూనాలను బీఎంసీ ప్రాంతం నుంచి సేకరించగా… ఇందులో 248 నమూనాల్లో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ను గుర్తించారు.
చాలా మంది కరోనా వ్యాక్సిన్ తీసుకోలే
అధికారులు తెలిపిన ప్రకారం.. 280 మందిలో 34శాతం అంటే 96 మంది రోగులు 21-40 సంవత్సరాల వయసున్న వారున్నారు. 28శాతం 79 మంది రోగులు 41-60 సంవత్సరాల వయసున్న వారున్నారు. 22 మంది బాధితులు 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గల వారు. అదే సమయంలో, 280 మంది బాధితుల్లో ఏడుగురు మాత్రమే కొవిడ్ టీకా ఫస్ట్ డోసు తీసుకున్నారు. 174 మంది రెండు డోసుల టీకా తీసుకున్న 89 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి రాగా.. ఆయా బాధితుల్లో ఇద్దరికి ఆక్సిజన్ మద్దతు అవసరం కాగా.. 15 మంది రోగులను ఐసీయూలో చేరాల్సి వచ్చింది. 99 మంది బాధితులు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు.
ముంబైలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి
ముంబైలో ఓమిక్రాన్ సామాజికవ్యాప్తిని నిపుణులు గుర్తించారు. ఈ నివేదికను ఆరోగ్యమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. ముంబై, ఢిల్లీలో ఒమిక్రాన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ప్రారంభమైంది. వేరియంట్ సోకిన వారికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ ఉండదని, అంతే కాకుండా కొవిడ్ సోకిన వారితో సంబంధం లేకుండా ఒమిక్రాన్ బారినపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని బీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒమిక్రాన్ వ్యాప్తిని నిరోధించేందుకు నిబంధనలు పాటించడం తప్పనిసరి పేర్కొన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను సరిగా శుభ్రం చేసుకోవడం తప్పనిసరని, వాటిని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BMC
- Covid-19
- Delta Variant
- Mumbai
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

