భారత దేశంలో దాదాపు 100 శాతం ప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారట. తాజాగా గ్రీన్పీస్ ఇండియా అనే సంస్థ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశ 99 శాతంపైగా ప్రజలపై పీఎం2.5 కాన్సన్ట్రేషన్స్ ప్రభావం ఉంటోందని ఈ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) మార్గదర్శకాల్లో పేర్కొన్న దాని కన్నా ఐదు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
దేశంలో అత్యంత కలుషితమైన గాలి ఉన్న ప్రాంతం ఢిల్లీ ఎన్సీఆర్ కాగా.. బిహార్, ఉత్తరప్రదేశ్, హరియాణా, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇలా కలుషితమైన గాలి పీల్చడం వల్ల ప్రజల్లో అనేక రకాల రుగ్మతలు ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.