ప్రభుత్వ భూమిలో ‘నమాజ్’ హక్కు కాదు
నమాజ్ చేయడానికి లేదా మతపరమైన భారీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వ భూమిని హక్కుగా ఉపయోగించరాదని అలహాబాద్ హైకోర్టు శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది.
- ప్రజల భద్రతకు లోబడే మత స్వేచ్ఛ హక్కు
- అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, మే 2: నమాజ్ చేయడానికి లేదా మతపరమైన భారీ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వ భూమిని హక్కుగా ఉపయోగించరాదని అలహాబాద్ హైకోర్టు శనివారం సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజా స్వేచ్ఛకు సంబంధించిన రాజ్యాంగ హక్కు లేదా భద్రతకు, ఇతరుల హక్కులకు లోబడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాకు చెందిన ఇకొన గ్రామంలోని స్థలంలో నమాజ్ చేసేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఆ భూమి తన సొంత ఆస్తి అని, అందులో ప్రార్థనలు చేసేందుకు అధికారులు రక్షణ కల్పించాలని కోరుతూ అసీన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ని జస్టిస్ గరిమ ప్రసాద్, జస్టిస్ సరల్ శ్రీవాస్తవతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. భూమి తన సొంతమైనప్పటికీ తనను నమాజ్ చేయకుండా చట్టవిరుద్ధంగా అడ్డుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్తిలో నమాజ్ చేయడానికి ముందస్తు అనుమతి అవసరం లేదని పేర్కొంటూ ప్రార్థనలపై ఆంక్షలు విధించడం తన రాజ్యాంగపరమైన హక్కులను అతిక్రమించడమేనని ఆయన వాదించారు.
ఈ పిటిషన్‌ని తిరస్కరించిన యూపీ ప్రభుత్వం ఆ భూమి రెవెన్యూ రికార్డులలో ప్రజా వినియోగం కోసం ఉద్దేశించిన అబాదీ భూమి(నివాసయోగ్యమైన భూమి)గా నమోదైందని, చట్టపరమైన యాజమాన్యాన్ని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని వాదించింది. పిటిషనర్ ఉదహరించిన దానపత్రంలో భూమిని గుర్తించే ముఖ్యమైన గుర్తులు లేవని కోర్టుకు తెలిపింది. పిటిషనర్ గ్రామం లోపల, వెలుపల నుండి ప్రజలను ఆహ్వానించడం ద్వారా సాధారణ సామూహిక ప్రార్థనలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది స్థానిక సామాజిక సమతుల్యతకు భంగం కలిగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది.
దీనిపై ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ రాజ్యాంగం మత స్వేచ్ఛకు హామీ ఇచ్చినప్పటికీ అది ప్రజా భద్రత, నైతికత, ఆరోగ్యం పరిధిలోకి వస్తుందని తెలిపింది. ప్రభుత్వ భూమి ఉమ్మడి వినియోగం కోసం ఉద్దేశించిందని, దాన్ని పౌరుల శాంతి భద్రతలకు భంగం కలిగించే మతపరమైన కార్యకలాపాల కోసం వినియోగించరాదని స్పష్టం చేసింది. వ్యక్తిగత ప్రార్థనలకు, మతపరమైన సమావేశాలకు మధ్య వైరుధ్యం ఉందని ్ట తెలిపింది. భూ యాజమాన్యాన్ని నిరూపించడంలో విఫలం కావడం, ఆ భూమి ప్రభుత్వ భూమిగా వర్గీకరించిన స్థితి కొనసాగడంతో పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

