న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఇక నుంచి దివ్యాంగులంతా పరీక్షలు రాయడానికి స్ర్కైబ్ల సహాయాన్ని తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 40 శాతం నిర్దిష్ట వైకల్యం(బెంచ్మార్క్) ఉందా, లేదా అనే అంశంతో సంబంధం లేకుండా స్ర్కైబ్ సహాయం పొందవచ్చని తెలిపింది. బెంచ్మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉండే ప్రయోజనాలను పరిమితులు లేకుండా పీడబ్ల్యూడీ అభ్యర్థులు అందరికీ అమలు చేయాలని స్పష్టం చేసింది.
గుల్షన్ కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారించిన జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం ఈ మేరకు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. కేంద్రానికి పలు మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. వీటిని రెండు నెలల్లో అమలు చేయాలని ఆదేశించింది.